పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి.
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేగొండ మండలంలోని తిరుమలగిరి పాండవుల గుట్టలపై శుక్రవారం బుగులోని జాతర వైభవంగా ప్రారంభమైంది. జిల్లాతో పా టు ఇతర ప్రాంతాల నుంచి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలి�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు శుక్రవారం కార్తీక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి నృసింహ క్షేత్రం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి.