ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు శుక్రవారం కార్తీక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి నృసింహ క్షేత్రం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి. వేములవాడ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా దీపకాంతులే దర్శనమిచ్చాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. మరోవైపు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించారు. ధర్మపురి బ్రహ్మపుష్కరిణి (కోనేరు)ని వేలాది దీపాలతో అలంకరించారు.
– వేములవాడ టౌన్/ ధర్మపురి, నవంబర్ 15