బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అభివృద్ధి జరగడం లేదు..?
ఎంపీ అర్వింద్‌కు మంత్రి వేముల ప్రశ్న
మోర్తాడ్(కమ్మర్పల్లి), ఏప్రిల్ 3: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు జరగడం లేదని, ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎంపీ అర్వింద్ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్, కమ్మర్పల్లి, హాసాకొత్తూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇవ్వడం, గెలిచాక డ్రామాలు ఆడడం అర్వింద్‌కు అలవాటు అయ్యిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులను తిట్టి పబ్బం గడుపుకోవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. మాధవ్నగర్ఆర్వోబీకి ఎంపీ తెచ్చింది కేవలం అనుమతి పత్రమేనని, బ్రిడ్జి నిర్మాణానికి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు. ఆర్వోబీ పనులు జరుగుతాయని తెలిసే ఉద్యమం, ధర్నా చేస్తానని కొత్త నాటకాలకు ఎంపీ తెరలేపుతున్నారని విమర్శించారు. పల్లెప్రగతి పనులతో గ్రామాలకు కొత్త అందాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు.
పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలకు కేంద్రమే నిధులు ఇస్తున్నదని చెబుతున్న బీజేపీ నాయకులు.. బీజేపీ పాలిత రాష్ర్టాలో ఆ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ ఎంపీపీలు గౌతమి, శివలింగు శ్రీనివాస్, మోర్తాడ్ జడ్పీటీసీ బద్దం రవి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.