RSA vs CAN : గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా పదో ఎడిషన్‌లో అదిరే బోణీ చేసింది. బ్యాటింగ్ యూనిట్ దంచేయగా.. బౌలింగ్ దళం కెనడాను వణికించింది. లుంగి ఎంగిడి(4-31) సంచలన స్పెల్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడినా.. నవనీత్ ధలివాల్(64) అర్ధ శతకంతో మెరవగా.. హర్ష్ ఠాకెర్(33) రాణించాడు. కానీ, సాధించాల్సిన రన్‌రేటు పెరిగిపోవడంతో పెద్ద షాట్లు ఆడబోయి టెయిలెండర్లు సైతం పెవిలియన్ చేరారు. దాంతో.. సఫారీ టీమ్ 57 పరుగుల తేడాతో గెలుపొంది ఘనంగా టోర్నీలో అడుగుపెట్టింది.
పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయంతో బోణీ కొట్టింది. అహ్మదాబాద్‌లో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(54), ట్రిస్టన్ స్టబ్స్(34 నాటౌట్), డేవిడ్ మిల్లర్(39 నాటౌట్)ల మెరుపులతో 214 పరుగుల భారీ స్కోర్ బాదిన ప్రొటీస్ జట్టు.. ఆతర్వాత ప్రత్యర్థిని 156కే కట్టడి చేసింది. పేసర్ లుంగి ఎంగిడి(4-31) నిప్పులు చెరగగా కెనాడా బ్యాటర్లు చేతులెత్తేశారు. నవనీత్ ధలివాల్(64) హాఫ్ సెంచరీతో చెలరేగినా.. సహచరుల నుంచి స్పందన కరువవ్వడంతో సఫారీ జట్టు 57 పరుగులతో జయభేరి మోగించింది.
🚨 MATCH RESULT 🚨#TheProteas kick off their #T20WorldCup campaign in style with a well-controlled 57-run victory against Canada! 😎🇿🇦
From a clinical batting display in the first innings to decisive bowling in the second, presenting a complete team performance. 🔥👏… pic.twitter.com/UjqfkZZsTt
— Proteas Men (@ProteasMenCSA) February 9, 2026
భారీ ఛేదనలో కెనడా తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. ఎంగిడి(4-31) సంధించిన బంతిని ఆడాలా? వద్దా? అనే సందేహంతో టచ్ చేసిన కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా(0) వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లో యువరాజ్ సమ్ర(12), నికోలస్ కిర్టన్(4)లను ఔట్ చేసిన ఎంగిడి కెనడాను కష్టాల్లోకి నెట్టాడు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ప్రత్యర్థిని ఈసారి రబడ దెబ్బకొట్టాడు. భారీ షాట్లు ఆడుతున్న శ్రేయాస్ మొవ్వ(9) ను బౌల్డ్ చేసి నాలుగో వికెట్ అందించాడు.
A match-changing spell! 🔥
Lungi Ngidi delivers an outstanding return in our #T20WorldCup opener! 💪🏏
Destructive in the powerplay and controlled at the death. Phenomenal bowling from the #Proteas pacer! 🇿🇦#Unbreakable #T20WorldCup pic.twitter.com/OEzK7iBWrZ
— Proteas Men (@ProteasMenCSA) February 9, 2026
టాపార్డర్ కుప్పకూలిన వేళ నవనీత్ ధలివాల్(64), హర్ష్ ఠాకెర్(33)లు జాగ్రత్తగా ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాది స్కోర్ వంద దాటించారు. కవర్స్‌పై బౌండరీ బాదిన హర్ష్ ఆ తర్వాత బంతికే బిగ్ షాట్ ఆడి ఔటవ్వగా.. ఐదో వికెట్ 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధ శతకం తర్వాత ధలివాల్ దూకుడుగా ఆడే క్రమంలో బాస్చ్ ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆడేవాళ్లెవరూ లేకపోవడంతో కెనడా 156కే పరిమితమైంది. దాంతో.. 57 పరుగులతో గెలిచిన ప్రొటీస్ జట్టు వరల్డ్‌కప్ వేటను ఘనంగా ఆరంభించింది.
టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ బదులు బౌలింగ్ ఎంచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాను తక్కువకే కట్టడి చేయాలనుకున్న ఆ జట్టు ఆశలు ఆడియాశలయ్యాయి. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (59).. క్వింటన్ డికాక్(25)లు కెనడా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ధనాధన్ ఆడారు. డికాక్‌ను బౌల్డ్ చేసిన దిల్‌ప్రీత్ బజ్వా తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి పునాది వేసిన ఈ ద్వయాన్ని విడదీశాడు.
Aiden Markram races to a flawless fifty against Canada 👊
It is one of our @marriottbonvoy Milestones of the tournament. pic.twitter.com/U8XR3nYkj9
— T20 World Cup (@T20WorldCup) February 9, 2026
మర్క్రమ్ దూకుడుగా ఆడి 28 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. కానీ, కాసేపటికే అతడు అన్ష్ పటేల్ ఓవర్లో ఔటయ్యాడు. అనంతరం డెవాల్డ్ బ్రవిస్(6) విఫలమైనా.. రియాన్ రికెల్టన్(33).. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగాడు. ట్రిస్టన్ స్టబ్స్(34 నాటౌట్), డేవిడ్ మిల్లర్(39 నాటౌట్)లు డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించారు. ఫలితంగా సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.