ఎల్లారెడ్డి రూరల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు.
కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేను, పార్టీని దుర్భాషలాడటాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై సమాధానం చెప్పాలని గత ఏడాది నవంబర్ 21వ తేదీన వడ్డేపల్లి సుభాశ్కు షోకాజ్ నోటీసులను హైకమాండ్ పంపించింది. దీనిపై అదే ఏడాది నవంబర్ 20న ఆయన సమాధానం అందజేశారు.
వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి సమాధానంతో సంతృప్తి పడని పార్టీ హైకమాండ్, క్రమశిక్షణ సంఘం ఆయనపై వేటు వేసింది. తక్షణమే ఈ బహిష్కరణ అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.