కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం సందర్భంగా కేరళ సింగారి మేళంతో మంగళవారం అయ్యప్ప ఆలయం నుండి సిరిసిల్ల రోడ్డు, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, జేపిఎన్ రోడ్డు మీదుగా ఆభరణాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు మహిళలు చిన్నారులు నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ ఆభరణాల ఊరేగింపులో మొదటి పెట్టెను నూకల ఉదయ్, రెండవ పెట్టెను జొన్నల ప్రసాద్, వెంకటేశం ఆభరణాలను ఎత్తుకొని ఆలయం వరకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షుడు పట్నం రమేష్, కార్యదర్శి గోనే శ్రీనివాస్, కుంభాల రవి యాదవ్, అయ్యప్ప స్వాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.