ఎల్లారెడ్డి రూరల్ : రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కామారెడ్డి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బలరాం (Assistant Commissioner) కోరారు. ఎల్లారెడ్డి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో (Tenth Students) మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలలో వచ్చిన పలుమార్పులను విద్యార్థులకు వివరించారు.
ఈ సంవత్సరం నుంచి పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈసారి నుంచి పరీక్షలకు గ్రేడింగ్ (Gradeing) కేటాయించడం ఉండదన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్ గా 20 మార్కులు, వార్షిక పరీక్షలలో 80 మార్కులు జత చేస్తారని వివరించారు. ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు ఏడు రోజులలో జరుగుతాయన్నారు. పదవ తరగతి మెమోరాండంలో విద్యార్థుల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ముద్రణ ఉంటుందని వెల్లడించారు. ఆయనతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు లింగమూర్తి, కృష్ణారెడ్డి, రామకృష్ణ, దేవదాస్, మాధవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.