బాన్సువాడ టౌన్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర ఆలయం నుంచి 30 మంది శివ మాల ధారణ స్వాములు శ్రీశైలం వరకు పాదయాత్రగా (Padayatra ) బయలు దేరారు. గురు స్వామి సుభాష్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా శివ మాలధారణను (Shiva Maladharana) దరిస్తున్నామని అన్నారు. 11 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోచిరం, హన్మాండ్లు, శ్రీనివాస్, ఆనంద్, శివ మాలధారణ స్వాములు పాదయాత్రలో పాల్గొంటున్నారు.