Banswada | బాన్సువాడ రూరల్, మార్చి 11 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికా(డీఎల్పీవో)గా సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బాన్సువాడ ఎంపీవోగా ఆయన విధులు నిర్వహించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లోని గ్రామపంచాయతీలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ్లాల తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామాలలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, పని అడిగిన ప్రతి కూలికి పనులు కల్పించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.