నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 7: ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అన్నారు. బోధన్ పట్టణంలోని చెక్కిక్యాంప్‌లో బతుకమ్మ చీరలను మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, కమిషనర్ రామ లింగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు శరత్‌రెడ్డి, దూప్‌సింగ్, శ్రీకాంత్‌గౌడ్ పంపిణీ చేశారు. బోధన్ మండలం సాలూరాలో ఎంపీపీ బుద్దెసావిత్రి, సర్పంచ్ చంద్రకళ, సొసైటీ చైర్మన్ జనార్దన్, ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో సర్పంచ్ సావిత్రి, ఎంపీటీసీ రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఠాణాకలాన్, పోచారం గ్రామాల్లో సర్పంచులు భాస్కర్‌రెడ్డి, ఇంద్రకరణ్, ప్రజాప్రతినిధులు చీరలను అందజేశారు. నవీపేట మండలం రాంపూర్‌లో సర్పంచ్ కల్పనతో కలిసి జడ్పీటీసీ సవిత, బుచ్చన్న, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీటీసీ లావ ణ్య చీరలను పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని వార్డు ల్లో, మండలంలోని గ్రామాల్లో చీరలను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు గంగామోహన్‌చక్రు, హన్మాండ్లు, వరలక్ష్మి, సంగీత, లత, రమేశ్, జనార్దన్రాజ్, లావణ్య, టీఆర్ఎస్ నాయకుడు ఖాందేశ్ సత్యం చీరలను మహిళలకు అందజేశారు. ధర్పల్లిలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. ఇందల్వాయి మండలం చాంద్రాయన్‌పల్లి, దేవీతండా, లోలం గ్రామాల్లో మహిళలకు ఎంపీపీ రమేశ్ నాయక్‌తో కలిసి ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మో హన్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సిరికొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మలావత్ సంగీత, జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్ చీరలు పంపిణీ చేశారు. జక్రాన్‌పల్లిలో ఎంపీపీ డీకొండ హరిత, జడ్పీటీసీ తనూజ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద, తిర్మన్‌పల్లి గ్రామాల్లో సర్పంచులు సుప్రియానవీన్, శ్రీనివాస్‌రెడ్డి, మోపాల్ మండల కేంద్రంతోపాటు మంచిప్ప, సిర్పూర్, కులాస్పూర్ గ్రామాల్లో సర్పంచులు రవి, సిద్ధార్థ, ముత్యంరెడ్డి, మమతాసాయిరెడ్డి, కులాస్పూర్ తండాలో శ్రావణ్ చీరలు పంపిణీ చేశారు. కోటగిరి మండలం సుంకిని,లింగాపూర్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. చందూర్ మండలం మేడ్పల్లిలో ఎంపీటీసీ శ్యామ్‌రావు, సర్పంచ్ రవి చీరలు పంపిణీ చేశారు.