నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 4: మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని సహకార బ్యాంకు అధికారులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. రుణాల రికవరీకి పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సో మవారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో మొండి బకాయిలు, రికవరీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణాల వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూ డు నెలలపాటు సస్పెండ్ చేస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకుంటే శాశ్వతంగా ఇంటికి పంపుతామని హెచ్చరించారు. బకాయిలను సకాలంలో వసూలు చేయకపోవడంతో రోజురోజుకూ పాత బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే బ్యాంకు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. ఇక నుంచి ప్రతిరోజూఎంత రికవరీ అ య్యిందో చెప్పాలని సీఈవోను ఆదేశించారు. త్వరలోనే బదిలీలు ఉంటాయని, ఏ బ్రాంచ్‌కు పంపితే అ క్కడే పనిచేయాలన్నారు. బ్యాంకులకు వచ్చే సొసైటీ చైర్మన్లు, రైతులు, ఖాతాదారులకు మర్యా ద ఇస్తూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డైరెక్టర్లు, బ్యాంకు సీఈవో గజానంద్, జనరల్ మేనేజర్లు లింబ్రాది, అనుపమ పాల్గొన్నారు.