పిట్లం/బిచ్కుంద/తాడ్వాయి/విద్యానగర్, అక్టోబర్ 3 : పిట్లం మండలకేంద్రంతోపాటు చిన్నకొడప్గల్ గ్రామంలో మహిళలకు ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా అందజేస్తున్న చీరలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు విజయలక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, కవితా శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, విండో చైర్మన్ శపథంరెడ్డి, ఉపసర్పంచులు ఇబ్రహీం, శశికాంత్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రవిచంద్ర, బొంతల శ్రీనివాస్, ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, బాబు మేస్త్రి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి రహమతుల్లా, పంచాయతీ కార్యదర్శి విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సాగౌడ్, కరీం, రహమాన్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం వాజిద్నగర్ గ్రామంలో సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు బండకింద సాయిలు, ఉపసర్పంచ్ బద్రి సాయిలు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సిద్ధిరాంపటేల్, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ సభ్యురాలు భారతీ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలను ఎంపీపీ రవి, జడ్పీటీసీ రమాదేవి పంపిణీ చేశారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి, తాడ్వాయి, కృష్ణాజివాడి, కన్కల్, ఎర్రాపహాడ్, చిట్యాల, సంతాయిపేట గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింహులు, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు ఇందిర, సంజీవులు, భూషణం, నర్సారెడ్డి, కవిత, నాయకులు రాజిరెడ్డి, హైమద్, ధర్మపురి, సాయిరెడ్డి, గంగారెడ్డి, రాజయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలో 46, 47వ వార్డుల మహిళలకు కౌన్సిలర్లు కన్నయ్య, గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజాగౌడ్, బబిత, కాలనీవాసులు పాల్గొన్నారు.
నేడు చీరల పంపిణీ
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 3 : మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరలను సోమవారం పంపిణీ చేయాలని ఎంపీడీవో రఘు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 11వేల 811 చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్‌కార్డులు కలిగిఉన్న వారందరికీ చీరలు అందజేస్తామని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.