హైదరాబాద్ : పసిగుడ్డు మొహమైనా చూసి వదిలేయండన్నా అంటే.. దుర్మార్గుడు, మానవమృగం కాలితో తంతే పసి పాప చనిపోయింది. నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? అని కేటీఆర్(KTR) మండిపడ్డారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool) కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప ( Child Died ) కుటుంబాన్ని కేటీర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర జాతర ఘటన అత్యంత బాధాకరమన్నారు.
తమ నెలల బిడ్డ దుర్మార్గుల దాడిలో మృతి చెందిందని బాధితులు మౌనిక, గణేష్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ తీసుకోండని అడిగితే మీరు సరిగ్గా రాసి ఇవ్వలేదని అన్నాడు అంట. పైగాసుమోటోగా కేసు తీసుకోవాల్సింది పోయి.. అధికార నాయకులకు ఫోన్ చేసి మీ మీద ఫిర్యాదు చేసారు. మీరు కూడా ఫిర్యాదు చేయండని సిగ్గులేకుండా ప్రేరేపించాడని స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు కాదు, నువ్వు సేవ చేయాల్సింది బాధితులకు గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు.
పసిగుడ్డు మొహమైనా చూసి వదిలేయండన్నా అంటే.. దుర్మార్గుడు, మానవమృగం కాలితో తంతే పసి పాప చనిపోయింది
బాధితులు మౌనిక, గణేష్ పోయి కంప్లైంట్ తీసుకోండని పోలీసులను అడిగితే మీరు సరిగ్గా రాసి ఇవ్వలేదని అన్నాడు అంట
నీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు కాదు.. నువ్వు సేవ… https://t.co/ShKryN5pPm pic.twitter.com/eIVGoZLxSb
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026