టేకులపల్లి, ఫిబ్రవరి 25 : టేకులపల్లి మండలంలోని కొత్తతండా (పీ) వెళ్లే రోడ్డుపై వర్షం నీరు ఆగి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి గుంతలమయం అవుతున్నట్లు తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అలాగే గ్రామ పంచాయతీలో చెత్తాచెదారం పేరుకుపోయిందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. సులానగర్ పంచాయతీలో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయకుండా రోడ్డు పక్కనే తగలబెడుతుండడంతో కరెంట్ వైర్లకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. సులానగర్ సెక్రటరీ, మల్టీ పర్పస్ వర్కర్స్ నిర్లక్ష్యం వీడి శుభ్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

చిన్న చినుకుపడితే బురదే.. కొత్తతండా (పీ) గ్రామస్తుల ఇబ్బందులు