వేల్పూర్, అక్టోబర్ 2: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, భీమ్‌గల్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, టీఆర్ఎస్ భీమ్‌గల్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య, గున్వీర్రెడ్డి, టీఆర్ఎస్ వేల్పూర్ మండల కన్వీనర్ నాగధర్, రామన్నపేట్ సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, శోభన్, నరేందర్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారు..
వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామానికి శోభన్‌రెడ్డి(కాంగ్రెస్), భూమేశ్వర్‌రెడ్డి(బీఎస్పీ), నరేశ్(బీజేపీ), భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన మారంపల్లి రాజేశ్వర్(బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీకి చెందిన బండారు బక్కన్న, గుంటూరు గంగాదాస్, సాయిలు, తొగిటి నవీన్, ఆరెపల్లి బాలరాజ్, బంగ్లా రాజు, చిలువేరి రాజేశ్, లక్కాకుల సందీప్, వకీల్, షేక్, మతిన్, షేక్ సాధక్, ముచ్కూర్ గ్రామానికి చెందిన ముత్యాల దాస్(కాంగ్రెస్), సొసైటీ మాజీ చైర్మన్ బీఎన్‌రెడ్డి, మహిపాల్, బాశెట్టి, సంతోష్, జలం, ఆడే రవి, నండీదపు అనిల్‌తోపాటు సుమారు వందమంది టీఆర్ఎస్లో చేరారు.