లింగంపేట్ (తాడ్వాయి): తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ (Yerrapahad) తన వర్గీయులే విజయం సాధించారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి (Eanugu Ravinder Reddy) అన్నారు. మొదటి విడతలో భాగంగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తన వర్గానికే చెందిన సర్పంచ్ అభ్యర్థి సోంకేటి మల్లవ్వ బీరయ్య గెలుపొందారని చెప్పారు. పంచాయతీ పరిధిలోని 10 మంది వార్డు సభ్యుల్లో 9 మంది తన వర్గానికి చెందిన వారేనని వెల్లడించారు. పంచాయతీ సర్పంచితో పాటు అన్ని వార్డుల్లో తన మద్దతుదారులు విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారని పేర్కొన్నారు. సర్పంత్తో పాటు ఉపసర్పంచిగా ఏనుగు ప్రభాకర్ ఎన్నికయ్యారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.