బాన్సువాడ రూరల్, జూన్ 19: వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు. కొయ్యగుట్ట తాండలో ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ జ్వరం, జలుబు, ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారి వివరాలను సేకరించారు. అనారోగ్యానికి గురైతే సమాచారం అందించాలని, నిర్లక్ష్యం వహించకుండా బాన్సువాడ ప్రభుత్వ నవాఖానలో చికిత్స చేసుకోవాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి పరసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాండ వాసులకు ఆమె సూచించారు. అనురాధ వెంట ఆశ కార్యకర్త సక్కుబాయి తదితరులు ఉన్నారు.