మాచారెడ్డి : మాచారెడ్డి (Machareddy) మండల కేంద్రంలో ఆర్టీసీ (RTC) బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలానికి వెళ్తుంది. మాచారెడ్డి బస్టాండ్ లో నుంచి బయటికి వెళ్తుండగా బస్సు విద్యుత్ స్తంభాన్ని ( Electricity Pole ) బలంగా ఢీ కొంది. దీంతో ఒక విద్యుత్ స్తంభం నెలకొరవడంతోపాటు మరొక విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగింది. వెంటనే ప్రయాణికులు బస్సు దిగారు. స్తంభాలకు ఉన్న విద్యుత్ వైరు బస్సు పై ఏ మాత్రం పడిన ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.