ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ రూరల్/ కామారెడ్డిరూరల్/భిక్కనూర్/ గాంధారి, ఏప్రిల్ 22 : ఎల్లారెడ్డి మండలకేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ముస్లిములకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లను అందజేస్తున్నదన్నారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు డయాలసిస్ సెంటర్‌ను తీసుకువచ్చామని, అందుబాటులో అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. దవాఖానలోని వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్, ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ మునీరుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్ కుమార్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, కో-ఆప్షన్ సభ్యుడు ముజ్జు, నాయబ్ తహసీల్దార్ సముద్రాల స్వామి పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉస్మాన్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, నాయకుడు సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా నూతన వస్ర్తాలను ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేసినట్లు స్థానిక సర్పంచ్ చింతల రవితేజాగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాత లక్ష్మణ్, వైస్ చైర్మన్ శంకర్‌గౌడ్, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఫాజిల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూర్‌లోని తహసీల్ కార్యాలయ ఆవరణలో ముస్లిములకు ఎంపీపీ గాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింహులు, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సొసైటీచైర్మన్ భూమయ్య, వైస్‌చైర్మన్ రాజిరెడ్డి రైతుబంధు సమితి సమితి మండల కన్వీనర్ రామచంద్రం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సర్దార్ అలీఖాన్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు అజార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, ఉపసర్పంచ్ నరేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి రామచంద్రం, నాయకులు రాజలింగం, బసవయ్య పాల్గొన్నారు.
గాంధారి మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముస్లిములకు రంజాన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సతీశ్, జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, ఎంపీటీసీలు తూర్పు రాజు, కామెల్లి బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, ఉపసర్పంచ్ రమేశ్, గౌస్ పాల్గొన్నారు.