నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 5 : మద్యం మత్తులో తల్లిని హతమార్చిన సంఘటన నిజామాబాద్ మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగేశ్వర్ మద్యా నికి బానిసగా మారాడు. చీటికి మాటికి భార్య సంధ్యను కొట్టేవా డు. దీంతో విసిగిపోయిన సంధ్య మూడు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో గంగేశ్వర్ నిత్యం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలంటు తల్లి అంజమ్మ(56)ను వేధించేవాడు.అంతే కాకుండా పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావాలంటూ తల్లితో గొడవ పడేవాడు. సోమవారం మద్యంమత్తులో ఇంటికి వచ్చిన గంగేశ్వర్ తల్లితో గొడవపడ్డాడు. కోపంతో కర్రతో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమెకు బలమైన గాయమై అక్కడి కక్కడే మృతి చెం దింది. సమాచారం అందుకున్న సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్, రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.రూరల్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రామారెడ్డిలో తండ్రిని..
రామారెడ్డి, ఏప్రిల్ 5 : రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో తండ్రిని హతమార్చిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై భువనేశ్వర్రావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా శామ్నాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ (52) రెడ్డిపేట్లోని బంధువుల ఇంటికి శుభాకార్యం నిమిత్తం వచ్చాడు. అప్పటికే సత్యనారాయణ కుమారుడు రవి ఇక్కడకు చేరుకున్నాడు. తండ్రి సైతం రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఆగ్రహంతో రవి సత్యనారాయణ తలపై రోకలిదుడ్డుతో కొట్టడంతో తీ వ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆటోలో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా అ ప్పటికే మృత్యువాత పడ్డాడు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు యత్నించగా పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని తిరిగి కామారెడ్డి ఏరియా దవాఖానకు రప్పిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.