దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు
కామారెడ్డి జిల్లాలో 5,418 దరఖాస్తులు దాఖలు
2021-22లో రాజీవ్ విద్యా దీవెన కింద రూ.56.12లక్షల చెల్లింపు
న్యూ స్కీమ్ కింద రూ. 44.68 లక్షలు విద్యార్థుల ఖాతాలకు బదిలీ
ప్రతి దళిత విద్యార్థీ స్కాలర్షిప్ పొందేలా ప్రణాళికలు
మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం
కామారెడ్డి, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. దళితబంధు పథకంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నది. సర్కారు బడిలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం పెట్టి నాణ్యమైన విద్యనందించడంతో పాటు పేద దళిత విద్యార్థుల కు ప్రతి ఏటా ఉపకార వేతనాలు (ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్) అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ప్రభు త్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్ధులకు (డే స్కాలర్) ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద ఎస్సీ విద్యార్థులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రీమెట్రిక్, రాజీవ్ విద్యాదీవెన కింద స్కాలర్షిప్లు అందిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ చెల్లింపులో కామారెడ్డి జిల్లా టాప్‌గా నిలిచింది.
కామారెడ్డి జిల్లాలో 5418 స్కాలర్ షిప్ దరఖాస్తులు
కామారెడ్డి జిల్లాలో న్యూ స్కీమ్, రాజీవ్ విద్యా దీవెన కింద మొత్తం 5,418 దరఖాస్తులు వచ్చినట్లు షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 7,994 మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 5,418 మంది దరఖాస్తులు చేసుకోగా, ఇంకా 2576 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు కోసం ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉం ది. న్యూ స్కీం కింద 5,843 టార్గెట్ ఉండగా ఇప్ప టి వరకు 3,746 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇంకా 2,097 మంది దరఖాస్తులు చే సుకోవాల్సి ఉంది. విద్యా దీవెన కింద 2,151 మందికి ఇవ్వాల్సి ఉండగా, 1672 మంది దరఖా స్తు చేసుకోగా, ఇంకా 634 మంది విద్యార్థులు చేసుకోవాల్సి ఉంది. అర్హులైన విద్యార్థులతో దరఖాస్తులు చేయించడంతో పాటు ఉపకార వేతనాల విడుదలకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
ప్రీ మెట్రిక్ పథకం…
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు న్యూ పథకం కింద 5నుంచి 8వ తరగతి బాలికలకు రూ. 1,500, బా లురకు రూ.1,000 ఉపకారవేతనంగా అందిస్తా రు. 9,10 విద్యార్థులకు రూ. 3000 చొప్పున ఏ డాదికి అందిస్తారు. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీ జత చేసి సమీప మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో 2020-21 విద్యా సంవత్సరంలో 7,605 మంది విద్యార్థులకు రూ. 95,72,000 ఉపకార వేతనంగా అందించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5,235 మంది వి ద్యార్థులకు రూ. 64,27,000 ఉపకార వేతనాలు అందించారు. న్యూ స్కీం కింద కామారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 2021-22లో ఇప్పటి వరకు రూ.44,71,000 బడ్జెట్ విడుదల కాగా, రూ.44,68,500 విద్యార్థులకు అందించారు.
రాజీవ్ విద్యా దీవెన పథకం….
పదో తరగతిలలోపు రెండు రకాల ఉపకార వేతనాలను ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్నది. రాజీవ్ విద్యా దీవెన పథకం 2012లో ప్రారంభం కాగా, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. 9,10వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ పధకం కింద బాలురు, బాలికలకు రూ.3వేలు ఉపకార వేతనం లభిస్తుంది. ఎస్సీ విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు, ఇతర విద్యా అవసరాల కోసం ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కొనసాగిస్తున్నది. రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 2020-21 రాష్ట్రంలో 9,097 దరఖాస్తులు రాగా, 7,346 మందికి రూ.22,039,000 ఉపకార వేతనాలు అందించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1672 దరఖాస్తులు రాగా, 1464 మంది విద్యార్థులకు రూ.56,12,000 విడుదల అయ్యాయి. రూ. 56,08,500 విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యా యి. రాష్ట్రంలో అత్యధికంగా నిధులు కామారెడ్డి జిల్లాకే విడుదల అయ్యాయి.
ఉపకార వేతనాల విడుదలలో జాప్యం లేకుండా ..
ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, రాజీవ్ విద్యా దీవెన కింద ఉపకార వేతనాల విడుదలలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2021-22 విద్యాసంవత్సరం గడువు సమీపిస్తుండడం.. మార్చి 31వరకు తుది గడువు ఉండడంతో పెండింగ్‌లో ఉన్న 2,576 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ దరఖాస్తులపై ప్రత్యేక చొరవ తీసుకుంటుండడంతో అత్యధిక ఉపకార వేతనాల విడుదలలో కామారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలించింది.
దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలో ఇంకా 2,576 మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31 వరకు గ డువు ఉంది. అందరి సహకారంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లింపులో కామారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలిచింది.కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రోత్సాహం అందిస్తుండడంతో ఇది సాధ్యమైంది.
– రజిత, కామారెడ్డి జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి