Kamareddy | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. ఒక్క రోజు పనిచేయకపోయినా పూట గడవని దుస్థితి వాళ్లది. అలాంటి కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. ఆ ఇంటి బిడ్డ రెండు కిడ్నీలు చెడిపోయాయి. బాలుడికి చికిత్స అందించాలంటే లక్షల్లో డబ్బు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ అంత డబ్బు లేకపోవడంతో తమ కొడుకును కాపాడుకునేందుకు దాతలు సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటుంది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన మిర్యాల చిరంజీవి కొడుకు అరవింద్ (12) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిసింది. దీంతో వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో ఒక్క రోజు కూలీ పనికి వెళ్లకపోయినా పూట గడవని పరిస్థితి. అయినప్పటికీ కొడుకును కాపాడుకునేందుకు అప్పు చేసి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పటివరకు దాదాపు రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేశారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు మెరుగైన వైద్యం చేయించాలంటే భారీగా డబ్బు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కానీ అంత డబ్బు తీసుకొచ్చే డబ్బు లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే డయాలసిస్, చికిత్స చేయిస్తున్నారు.
డబ్బులు లేక తమ కొడుకును కాపాడుకోలేని దీనస్థితిలో ఉన్నామని అరవింద్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దయతలచి తమకు ఆర్థిక సాయం చేస్తే.. కొడుకును కాపాడుకుంటామని వేడుకుంటున్నారు.
యూపీఐ, ఫోన్ నంబర్ : 9550657480
బ్యాంకు అకౌంట్ వివరాలు : A/c No. 33171422354 (ఎస్బీఐ, పిట్లం బ్రాంచి, ifsc code : sbin 0012969)