రుద్రూర్(కోటగిరి), ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రం విస్మరించిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. కోటగిరి మండల కేంద్రంతోపాటు పొతంగల్ గ్రామం లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. రాజ్యాంగం ప్రకారం దేశం లో ఆహార ధాన్యాలను రైతుల నుంచి సేకరించి ఎఫ్‌సీఐ ద్వారా అవసరమైన ప్రాంతాల ప్రజలకు సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. కా నీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకున్నదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా యాసంగిలో పండించిన వరి ధాన్యం మిల్లింగ్‌లో నూక శాతం అధికంగా వస్తుందన్నారు. దీనిని నివారించడానికి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరితే మొండి వైఖరి అవలంబించిందన్నారు. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కన్నా తక్కువ ధర రైతుకు చెల్లించి రైతును నష్టపరుస్తున్నారని అన్నారు.
రైతు నష్టపోవడం సరికాదని సీఎం కేసీఆర్ రైతుకు మద్దతు ధర అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరి పంట విస్తీర్ణం 35లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల వరకు పెరిగిందన్నారు. రైతులు పంట మార్పిడిపై ఆలోచన చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వంఅన్ని విధాలుగా రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. అనంతరం కోటగిరి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ముస్లిములు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, జడ్పీటీసీ శంకర్‌పటేల్, వల్లెపల్లి శ్రీను, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు.