తాడ్వాయి, మార్చి 6: మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించేవారు. బాలబాలికలకు వేర్వేరుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ఇతర గ్రామాల్లో ప్రైవేట్ స్కూళ్లలో చదివించేవారు. ఏడేండ్ల క్రితం గ్రామస్తుల సహకారంతో ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం లేకముందు విద్యార్థుల సంఖ్య 60 ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 160కి చేరింది. ఉన్నత పాఠశాలలో కూడా రెండేండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఇక్కడ కూడా విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాత సహకారంతో బెంచీలు, ఆట వస్తువులు, తాగునీటి వసతి ఏర్పాటుతో పాటు తరగతి గోడలపై బొమ్మలు వేయించారు.
ముఖ్యంగా పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు వేయించడంతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని ఎర్రాపహాడ్, చిట్యాల, దేమెకలాన్, కరడ్పల్లి, కన్కల్, బ్రాహ్మణపల్లి పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వడంతో విద్యార్థుల సంఖ్య పెరగనున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపా రు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం చేపట్టనుండడంతో పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ఉపాధ్యాయుల కొరత తీరునున్నదని భావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంతో ఉన్నత చదువులు చదివే అవకాశం ఆనందపడుతున్నారు.
మన ఊరు మన బడితో పాఠశాలలకు కొత్త వెలుగు
ప్రభుత్వం అమలుచేయనున్న మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్ర భుత్వ పాఠశాలలకు కొత్త వెలుగులు వచ్చి విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్లబోధన అందుతుంది. గ్రామా ల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లిష్ రావడంతో ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. పేద విద్యార్థులకు మంచి రోజలు వచ్చాయి.
-ఎలుపుల సాయిలు, ఎస్ఎంసీ చైర్మన్