కామారెడ్డి టౌన్, డిసెంబర్ 16 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్‌లో వివరాల నమోదును పూర్తి చేసి రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారతదేశంలోని ఐదు ఆధ్యాత్మిక సంస్థలు దీంట్లో పాలుపంచుకొనే 75 కోట్ల సూర్య నమస్కారాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా డిస్ట్రక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సూర్యనమస్కారాల సాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్ని జిల్లాల యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి తెలిపారు. ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి పాల్గొనాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31లోగా www.75croresuryanama skar.com వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యోగా గురువులు గరిపల్లి అంజయ్య, అంజయ్య, రఘుకుమార్, ఈశ్వర్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.