దోమకొండ, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని అంబారీపేట గ్రామంలో రూ. 25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును, ప్రభుత్వ పాఠశాలలో రూ. 29 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ.10 లక్షలతో నిర్మించిన మత్స్య సంఘ భవనంతోపాటు గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని ప్రభుత్వ విప్ సోమవారం ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మొక్కను నాటారు. సంగమేశ్వర్ గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ. 12 లక్షలతో చేపట్టిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లోని ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూరాయని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ జడ్పీటీసీ మధుసూదన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు సలీం, కరికె సుమలత, ఉప సర్పంచులు నరేశ్, వనిత, ఎంపీటీసీలు రాజేశ్వర్, శంకర్, విండో వైస్ చైర్మన్ రంగోల్ శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ బాపురెడ్డి పాల్గొన్నారు.