కమ్మర్పల్లి, జూన్ 26: ‘బాల్కొండ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సాధ్యంకాని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చూపించారు.. మీకు, మీ పార్టీకి మంత్రి వేముల గురించి మాట్లాడే అర్హత లేదు..’ అని మాజీ విప్ అనిల్‌పై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం వారు కమ్మర్పల్లి టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర పాలకులు, నాయకులు ఇప్పటికీ తెలంగాణ నుంచి జలవనరుల దోపిడీకి చేస్తున్న కుట్రలను తెలంగాణ బిడ్డగా ఎండగడుతున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శించే అర్హత అనిల్‌కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా తప్పించుకున్న అనిల్‌కు ప్రజలు బుద్ధి చెప్పిన చరిత్ర ఉందన్నారు.
నియోజకవర్గంలోని మానాలకు వైఎస్ సీఎంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నెరవేర్చారని గుర్తుచేశారు. కావాలంటే అక్కడి గిరిజనులను అనిల్ అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలకులు ఎస్సీరెస్పీ ఆయకట్టు బాగు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేస్తే నిధులు మంజూరు చేయించి కాలువ తీయించి చెరువులు నింపిన మంత్రి కృషిని అక్కడి రైతులను అడిగితే చెబుతారన్నారు. ఎమ్మెల్యేగా వెలగబెట్టిన అనిల్, ఆయన పార్టీకి రైతులపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. పూడుకుపోయిన నవాబు కాలువలు, లీకేజీల మయంగా మిగిలిపోయిన హన్మంత్ రెడ్డి ఎత్తిపో తల పథకాన్ని బాగు చేయించిన ఘనత మంత్రి వేములది కాదా..అని ప్రశ్నించారు. ప్రతి పల్లెకు తారు రోడ్ల సౌకర్యాన్ని మంత్రి కల్పించిన విషయాన్ని గిరిజనులను అడిగితే తెలుస్తుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలవత్ ప్రకాశ్, ఎంపీటీసీ మైలారం సుధాకర్, హల్దె శ్రీనివాస్, బద్రి, నాయకులు బోడ దేవేందర్, బద్దం రాజేశ్వర్, పార్శపు అరుణ్ రెడ్డి, రెంజర్ల మహేందర్, కొత్తపల్లి రఘు, సంత రాజేశ్వర్, లోలపు సుమన్, అజ్మత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.