బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 20 : సీఎం కేసీఆర్ బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి అన్నారు. బాన్సువాడ మండంలోని పోచారం, బోర్లం క్యాంపు, జక్కల్‌దాని తండాలో కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. పోచారం గ్రామంలో ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్ని వైస్ ఎంపీపీ హరిసింగ్, సర్పంచ్ రాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ప్రజా ప్రతినిధులతో కలిసి కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. బోర్లం క్యాంపులో సర్పంచ్ నాన్కుబాయి, జక్కల్‌దాని తండాలో సర్పంచ్ సంగ్యా నాయక్ స్థానిక నాయకులతో కలిసి కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచులు బలరాం, సాయి లు, పంచాయతీ కార్యదర్శులు సచిన్, భాస్కర్, నాయకులు సాయిరెడ్డి, విజయ్‌గౌడ్, నరేశ్‌గౌడ్, గోప్యానాయక్, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, సుభాష్, ఆశం, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలో..
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 20 : మండలంలోని సంగెం, అంకోల్, అంకోల్ తండా, హాజీపూర్ గ్రామాల్లో మంగళవారం లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డులను ఎంపీపీ పాల్త్య విఠల్ అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సాయిలు, వైస్ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు చంటి, బద్యా, సాయిలు, నాయకులు ప్రతాప్, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలంలో..
కామారెడ్డిరూరల్, సెప్టెబర్20 : కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. శాబ్దిపూర్, గూడెం గ్రామాల్లో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్డులను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు స్వామి, పస్తం యాదమ్మ, ఎంపీడీవో శంకర్, ఎంపీవో మల్హరీ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గొడుగుల బాల్‌రాజు, మాజీ జడ్పీటీసీ నిమ్మమెహన్రెడ్డి, మహేందర్, నిమ్మ నితీశ్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలంలో..
బీబీపేట్, సెఫ్టెంబర్ 20: బీబీపేట్తోపాటు మల్కాపూర్, తుజాల్పూర్, శేరీ బీబీపేట గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచులు లక్ష్మి, రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, వర్ణ స్రవంతి స్వామి ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, ఎంపీపీ బాలమణి, ప్రజాప్రతినిధులు కలిసి పంపిణీ చేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండలో..
దోమకొండ, సెప్టెంబర్ 20: దోమకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో కొత్త పింఛన్ కార్డులను జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ఎంపీపీ శారద పంపిణీ చేశారు. సింగిల్ విండో చైర్మన్ నాగరాజురెడ్డి, రైతుబంధు కన్వీనర్ నర్సారెడ్డి, సర్పంచ్ నల్లపు అంజ లి, ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గండ్రమధుసూదన్, నాయకులు రమేశ్, శ్రీనివాస్, నాగరాజు, నర్సింహులు, నర్సయ్య, శేఖర్, షమ్మీ పాల్గొన్నారు.
భిక్కనూర్ మండలంలో..
భిక్కనూర్, సెప్టెంబర్ 20 : భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్, ర్యాగట్లపల్లి, గురుజకుంట, సిద్ధిరామేశ్వరనగర్, లక్ష్మీదేవునిపల్లి, మల్లుపల్లి గ్రామాలకు చెందిన పలువురికి కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను ఎంపీపీ గాల్‌రెడ్డి పంపిణీ చేశారు. సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ భిక్షమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహరెడ్డి, మండల నాయకులు, నాగభూషణంగౌడ్, ఎంపీడీవో అనంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.