కమ్మర్పల్లి, ఆగస్టు 29: పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరుచేయిస్తూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నా రు. మండలంలోని హాసాకొత్తూర్‌లో నిలమెల లక్ష్మణ్‌కు రూ.55 వేలు, ఇత్తడి గంగామణికి రూ.35 వేలు, బంగ్లా సుధాకర్‌కు రూ.30 వేలు, షేక్ మస్తాన్‌కు రూ.20 వేలు, ముండ్ల రాజగంగుకు రూ.17 వేల 500, బషీరాబాద్‌లో పెద్ది మల్లేశ్, లక్మ ఉంబర్ రాజముత్యం, జాప శేఖర్, అల్లకొండ సింధూజకు రూ.లక్షా 75 వేలు మంజూరయ్యాయి. వీటిని బషీరాబాద్‌లో సర్పంచ్ సక్కారం అశోక్, టీఆర్ఎస్ నాయకులు బైకాని మహేశ్, హాసాకొత్తూర్‌లో రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ నోముల నరేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గడ్డం శ్రీధర్, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ అందజేశారు. కార్యక్రమంలో బక్కూరి గోపి, తెడ్డు రాజన్న, పొడేటి శంకర్, తెడ్డు కిరీటి, ఉప సర్పంచ్ విక్రమ్, బాశెట్టి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలో ఇద్దరికి..
డిచ్పల్లి, ఆగస్టు 29 : మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ముల్లంగి గ్రామానికి చెందిన ఎస్.రాందాస్‌కు రూ.24,500, గంగారాంనకు రూ.16వేల ఆర్థిక సహాయం మంజూరుకాగా, టీఆర్ఎస్ నాయకుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో చెక్కులు అందజేశారు. సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, పాశం మధుసూదన్ పాల్గొన్నారు.
రైతు బీమా చెక్కు అందజేత..
వేల్పూర్, ఆగస్టు 29: మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన లింగన్న ఇటీవల మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబానికి మంజూరైన రూ.ఐదు లక్షల రైతుబీమా చెక్కును అతడి భార్య లింబాయికి వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ఉపసర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్‌గౌడ్, రాజేశ్వర్, మధు, సంతోష్, గంగాధర్, దేవరాజ్, తలారి ప్రభాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.