నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: బోధన్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వ హించారు. ఇందులో భాగంగా బోధన్ జిల్లా ప్రభుత్వ దవా ఖానలో 29 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, రాకాసీ పేట్ అర్బన్‌హెల్త్ సెంటర్లో ఎనిమిది మందికి పరీక్షలు నిర్వ హించగా ఒకరికి, పాన్గల్లీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 16 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింద ని ఆయా దవాఖానల వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, రెండు రోజులుగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఎడపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లాక్డౌన్ ప్రభావం కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో రెండో డోస్‌లో భాగంగా పది మందికి వ్యాక్సిన్ వేసినట్లు సదరు దవాఖాన వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు.
రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 242 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ అంజలీ జామ్‌కార్ తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించి పలు సూచనలు చేశారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం 77 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యసిబ్బంది తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్లోని ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్‌రావు, ఆయేషా ఫిర్దోస్, స్వాతి వినూత్న, అమృత్ రాంరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు అనురాధ, అర్గుల్ సుభాష్ తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో 151 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ పాజిటివ్ రాలేదని సాలూరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు.
సాలూరా చెక్‌పోస్ట్ వద్ద 151 మందికి పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ పాజిటివ్ రాలేదని తెలిపారు. కేసులు తగ్గుతున్నప్పటికి మాస్కులు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మోర్తాడ్ సీహెచ్‌సీలో 14 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 87 మందికి టెస్టులు నిర్వహించగా 11 మందికి, చౌట్పల్లిలో 74 మందికి టెస్టులు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం 117 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. కోటగిరి ప్రభుత్వ దవాఖానలో 25 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ దవాఖానలో 100 మందికి టెస్టు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానలో శుక్రవారం 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మోస్రా మండలకేంద్రంలో 45 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. జక్రాన్‌పల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 71 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.