కామారెడ్డి టౌన్, అక్టోబర్ 31: కు టుంబ కలహాలు, ఆర్థికపరమైన గొ డవలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన పోచవ్వ(42), ఆమె భర్త సాయిలు(45) ఇద్దరి మధ్య గత బుధవారం రూ.ఆరువేల కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగి ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయారు. వీరి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. పట్టణంలోని చర్చి మైదానం పరిసర ప్రాంతంలో రెండు మృతదేహాలు ఆదివారం కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాలను గుర్తించారు. సా యిలు నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడగా, అక్కడికి సమీపంలోని కుంటలో భార్య పోచవ్వ మృతదేహం లభించింది. పోచవ్వ అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
దంపతుల మృతిపై అనుమానాలు!
దంపతుల మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాయిలు, పోచవ్వ గొడవపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.