కష్టమొస్తే కుంగిపోవద్దు
నెగెటివ్ ఆలోచనల నుంచి బయటికి రావాలి
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం
ఖలీల్వాడి, సెప్టెంబర్ 9: ఒంటరితనం.. వివా హ సంబంధాల కారణాలు, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, విడాకులు తీసుకున్నవారు.. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు.. సంతానలేమి సమస్యలు, కుటుంబ సంబంధ స మస్యలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగా లు, మానసిక సమస్యలు.. ఆత్మీయులు చనిపోయిన బాధతో.. ప్రేమ సంబంధ కారణాలు.. భూ వివాదాలు తదితర కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారని నివేదికలు వెల్లడించాయి.
ముందుగానే గుర్తించవచ్చు..
ఆత్మహత్యల ఆలోచనలు ఉన్న వారిని కుటుం బ సభ్యులు, మిత్రులు ముందుగానే గుర్తించవచ్చు. తరచుగా చనిపోవాలని ఉందని లేదా ఆత్మహత్య గురించి మాట్లాడడం, నిరాశగా మాట్లాడడం, జీవించి ఉండడంలో అర్థం లేదని మాట్లాడడం, ఆత్మహత్య చేసుకునే పద్ధతులను తెలుసుకోవడం, ఇంటర్నెట్లో వెతకడం లేదా తుపాకీ కొనడం, నిద్రమాత్రలు, పురుగుల మందులను సేకరించి పెట్టుకుంటారు. భరించలేని నొప్పి ఉన్న వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, జీవితంపై విరక్తి చెందినట్లు కనిపించినప్పు డు, తప్పు చేశానన్న భావనలు కలిగి ఉంటారు. ఇతరులకు భారంగా ఉన్నానని మాట్లాడడం, మద్యం లేదా మాదకద్రవ్యాల ఉపయోగం పెంచ డం, ఏ పనికైనా ఆసక్తి లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
ఆత్మహత్య నివారణ మార్గాలు ..
జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఒక పేపరుపై రాయాలి. ఈ సమస్యలను మీరు ఆలోచించగలిగే అన్ని పరిష్కారాలు రాయాలి. దీనిలో సహాయపడడానికి మీకు నమ్మకమైన మిత్రులు, కుటుంబ సభ్యులతో మీ సమస్యల పై చర్చించాలి. ఒకటి లేదా రెండు చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను నివారించవచ్చు.
అవగాహన సదస్సులు..!
తెలంగాణ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మహత్యలు నివారించడానికి కృషి చేస్తామని సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు మోతుకూరి రాంచందర్ తెలిపారు. ఈనెల 14 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9533660938 నెంబర్ను సంప్రదించాలని కోరారు. కారణమేదైనా ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదని ఆయన అన్నారు. ఆన్లైన్లో కూడా కౌన్సెలింగ్ చేయడానికి ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఆత్మహత్య చేసుకుని విఫలమైన వారూ తిరిగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినట్టు పేర్కొన్నారు.