
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎక్కడచూసినా పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ సారెను అందజేస్తున్నది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. గాంధారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జాజాల సురేందర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బాన్సువాడలో జరిగిన కార్యక్రమంలోనూ సభాపతి పాల్గొన్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, పిట్లంలో ఎమ్మెల్యే షిండే, నస్రుల్లాబాద్, బీర్కూర్‌లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి చీరల పంపిణీని ప్రారంభించారు. పేదింటి ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
పిట్లం/ బిచ్కుంద, అక్టోబర్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలు సంతోషంగా ఉండాలని బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నా రు. పిట్లం మండలంలోని రాంపూర్, బిచ్కుంద మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను శనివారం ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, అమ్మఒడి పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. రాంపూర్‌లోని అంగన్వాడీ, ఎస్సీ కమిటీ భవనాలతోపాటు సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభించి, నియోజకవర్గంలో ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి నిరుపేదలకు అందేలా చూస్తానన్నారు. ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ నారాయణరె డ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీబాయి బాబూసింగ్, వై స్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రహిమతుల్లా, ఎస్సీసెల్ అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శం కర్, మండల ప్రత్యేకాధికారి జగన్నాథాచారి, తహసీల్దార్ రామ్మోహన్‌రావ్, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, ఏపీఎం శిరీష, వార్డుసభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
గాంధారి/బాన్సువాడ, అక్టోబర్ 2 :
బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రేమతో ఇచ్చే కానుకలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధారి మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటీల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సాయంత్రం బాన్సువాడలో బతుకమ్మ చీరలతోపాటు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఐదేండ్లుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటీ ఐదులక్షల మంది మహిళలకు సుమారు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు చెప్పారు. అమావాస్య నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతాయని, పండుగకు ముందుగానే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చీరల పంపిణీ కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.
ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు చీరలు, ముస్లింలకు రంజాన్ పండుగకు దుస్తులు, క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ కార్యక్రమాలు ఎక్కడా లేవన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అన్నారు. త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5.4 లక్షలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.ఆడపడుచుల పేర్లపైనే ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ 119 నియోజక వర్గాలకు ఒక్కో నియోజక వర్గానికి 1400 ఇండ్ల ను ఇచ్చారని, కానీ బాన్సువాడ నియోజక వర్గానికి అత్యధికంగా 10 వేల ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటికై ఐదు వేల ఇండ్లు పూర్తయినట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి: ఎమ్మెల్యే జాజాల సురేందర్..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గత 70 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలో జరిగిందన్నారు. పల్లె ప్రగతి పనులతో గ్రామాల ముఖచిత్రాలు మారిపోయాయని అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని మతాల వారు పండుగలను సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు.
గాంధారిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం,ఎంపీడీవో సతీశ్, గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్, ఏపీవో గంగారాజు, విండో చైర్మన్ సాయికుమార్, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, ఏఎంసీ చైర్మన్ సత్యం, వైస్ ఎంపీపీ భజన్‌లాల్, మాజీ విండో చైర్మన్ ముకుంద్‌రావు, శివాజీరావు పాల్గొన్నారు. బాన్సువాడలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి , ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ.. మన సంస్కృతికి ప్రతీక
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
నస్రుల్లాబాద్/బీర్కూర్, అక్టోబర్ 2: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లోమహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ఆడపడుచులకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రంగురంగుల చీరలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంతోనే ఈ పండుగ ప్రాముఖ్యతను ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ప్రపంచానికి చాటారని అన్నారు.ఈ పండుగకు ఇతర రాష్ర్టాలతోపాటు దేశాల్లోనూ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు బతుకమ్మ చీరలను మన రాష్ట్రంలోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
గాంధారిలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, జడ్పీటీసీ జన్నుబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్ యాదవ్, గంగారాం, సుదీర్, మారుతి, తహసీల్దార్ ధన్వాల్,ఎంపీడీవో సుబ్రమణ్యం, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, కో-ఆప్షన్ మెంబర్ ఆరిఫ్, ఎంపీటీసీ సందీప్ పాటిల్, రైతుబంధు సమితి కన్వీనర్ ఆవారి గంగారాం, ఉపసర్పంచ్ షాహిన్ బేగం, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో రాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.