మద్నూరు: కామారెడ్డి జిల్లా మద్నూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు (Lakshmikantha Rao) ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకొని తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పాలకమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు సాయి పటేల్, ఆలయ చైర్మన్ రామ్ పటేల్, నాయకులు హన్మండ్లు స్వామి, ప్రజ్ఞా కుమార్, పరమేశ్, రమేష్, కైలాష్, శ్రీనివాస్, రాజు, తదితరులున్నారు.