లింగంపేట్ : సేవాలాల్ మహారాజ్ (Sevalal Birth Anniversary) జయంతి సందర్భంగా లింగంపేట్ మాలోత్ తండాలో నిర్వహించిన కబడ్డీ (Kabaddi) పోటీల్లో గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీక్ బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ జయంతి సందర్భంగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల్లో క్రీడల (Sports) పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడా పోటీలను స్నేహపూర్వకంగా నిర్వహించి వారిని ప్రోత్సహిస్తే అన్ని క్రీడల్లోనూ గ్రామీణ యువత సత్తా చాటుతారని వెల్లడించారు.
గిరిజన తండాలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో 36 టీములు పాల్గొన్నాయి. అందులో ప్రథమ స్థానం పొందిన పిట్లం టీం బంజారా వారియర్స్ జట్టుకు రూ. 16,888 నగదును అందజేశారు. పరమళ్ల తండాకు చెందిన యువకుల జట్టుకు రెండో బహుమతి కింద రూ. 8, 888 నగదు బహుమతులు అందజేశారు. విజేతలకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీ యొద్దీన్ ప్రదానం చేశారు.