పెద్ద కొడప్గల్( పిట్లం ) : కామారెడ్డి జిల్లా పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో శుక్రవారం కంటి వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ (Doctor Harikisan) కంటి వైద్య శిబిరాన్ని (Eye Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ కంటి సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. కంటి చూపు మందగించడం, మోతే బిందు వివిధ కంటి సమస్యతో బాధపడుతున్న వారికి ప్రతి శుక్రవారం ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.