బిచ్కుంద జూన్ 26 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కేంద్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. బిచ్కుంద లోని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ కూడలి మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద బిజెపి పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల మురికి కాలువల నిర్మాణం తో పాటు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి అర్ధంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు ప్రయాణించే వాహనదారులు, ప్రజలు దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నారు.
పనులను అప్పజెప్పిన కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీంతో సదరు కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. బిచ్కుంద మున్సిపల్ కేంద్రంతోపాటు మద్నూర్, పిట్లం మండలాల్లో కూడా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిచ్కుంద మండలం అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు, జిల్లా సెక్రెటరీ కాలకుంట్ల రాము, జాదవ్ పండరి, పీరాజీ, తదితరులు పాల్గొన్నారు.