కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. మూడు, నాలుగు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాచారెడ్డిలో విసిగి వేసాగిన రైతులు రాత్రి వేళా నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. కొద్ది మోతాదులో యూరియా బస్తాలను పంపి రైతులకు సరఫరా చేశారు.
తాజాగా మాచారెడ్డికి పొరుగు మండలంలో యూరియా కొరత తాకింది. రైతులు పొద్దున్నే సొసైటీ వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. యూరియా అవసరం ఉన్న రైతుల సంఖ్య భారీగా ఉండటంతో యూరియా బస్తాలు చేతికి దక్కుతుందో లేదో? అన్న కారణంతో కర్షకులు పెద్ద ఎత్తున వరుస కట్టారు.