కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో యూరియా(Urea) కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు పొద్దున్నే వచ్చి సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా సంచుల కోసం క్యూలైన్లో నిలబడి నీరసించి పోతున్నారు. గడిచిన 20 రోజులుగా సమస్య తీవ్రమవుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి, రామారెడ్డి మండలాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే యూరియా కోసం కర్షకులు భారీ వరుసలు కట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.