గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి ( Gandhari) మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులకు శనివారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్యాధికారి హరికిషన్ రావు ( Harikisan Rao) పాఠశాలలోని కంటి సమస్యలతో బాధపడుతున్న 36 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరుగురికి కంటి అద్దాలు అందజేయడంతో పాటు మరో ఇద్దరికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సురేష్ చంద్ర సిర్వి, ఏఎన్ఎం షబానా తదితరులు పాల్గొన్నారు.