నస్రుల్లాబాద్ :టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయ జనరల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మండల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని, ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబరు 15న జరిగే టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల గర్జన కార్యచరణ పై పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ అశోక్, విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్, గంగారాం, సుధీర్, మారుతి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు ప్రతాప్, యేడె మోహన్, మహేశ్, కిశోర్ యాదవ్, సాయిలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.