ఎల్లారెడ్డి రూరల్ : పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ మారెడ్డి రజితా రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్పీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగంపేట్ నాగిరెడ్డిపేట్ మండలాల్లోని ఎనిమిది ప్రాథమిక సహకార సంఘాలు, నాలుగు ఐకెపి కేంద్రాలకు ఎంఎస్పీ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ..యాసంగి 2024 – 25 మార్కెటింగ్ సీజన్‌ను పురస్కరించుకొని కమిటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్యాడి క్లీనర్లు, తేమ శాతం గుర్తించే యంత్రాలు, టార్పాలిన్లను అందజేశామన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, సభ్యులు ముప్పిడి హరి నారాయణ, కంచర్ల శ్రీనివాస్, శంకరయ్య, ఫూల్ సింగ్, గోపాల్, నాగేశ్వర్, ఆజం నగేష్, లక్ష్మీనారాయణ, గంగారెడ్డి, లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సిబ్బంది, ఆయా ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.