చందూర్: రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి నీడను కల్పిస్తుండగా పెరిగిన కొమ్మలు రోడ్లకు అడ్డంగా రావడంతో ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ పంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) జిల్లా చందూర్ (Chandur) మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా వస్తున్నాయి.
దీనివల్ల కొమ్మలు విద్యుత్ తీగలకు (Electricity Wires) తగలడంతో పలుమార్లు మంటలు వస్తున్నాయని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొమ్మల వల్ల విద్యుత్ అంతరాయం కలుగుతుందని, వాటిని నరికించినట్లు ( Branches Cutting) పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.