శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా మూడు నెలలకు సంబంధించిన హుండీల లెక్కింపును మంగళవారం లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 2,82,950 ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో జరిపించారు. లెక్కింపు ప్రక్రియలో బోధన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో ఈఓ రాములు, గ్రామాభూవృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి, ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాఠక్, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్పతో పాటు భక్తులు పాల్గొన్నారు. మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినట్లు శివాలయ నిర్వాహకులు తెలిపారు.