మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ (Chukkapur Temple) అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( Laxminarasomha Temple ) ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకీటలాడింది. సెలవు దినం కావడంతో చుట్టుపక్కల సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో శ్రీధర్ రావు ఏర్పాట్లు చేశారు.