మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. పరిశీలకులు కమల నిజామాబాద్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడు నెలలకు గాను హుండీలు లెక్కించగా మొత్తం రూ.6,34,805( ఆరు లక్షల 34 వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు) వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీధర్ రావు తెలిపారు.
ఇందులో నోట్లు రూ.558010, నాణెములు రూ.7679 వచ్చినట్లు పేర్కొన్నా. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజారెడ్డి, ఆంజనేయులు, ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు, పరంధామాచార్యులు, నరసింహచార్యులు, సంజీవచార్యులు, సిబ్బంది మహిళా సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.