బాన్సువాడ : బాన్సువాడ మండలం బుడ్మి గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డున హరిహర దేవి ఆలయ నిర్మాణానికి బుధవారం గురు మధనానంద సరస్వతి పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రాంతం భక్తి పారవశ్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. భక్తితోనే విముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ చెడు మార్గాన్ని వదిలి భక్తి మార్గంలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.