బాన్సువాడ రూరల్, మార్చి 18 : బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు (Borlam Government High School)మంగళవారం 2008-09 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలలో బెంచీల కొరత ఉన్నందున బెంచీలు కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం చేసినట్లు వారు తెలిపారు.
పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ అన్నారు. పూర్వ విద్యార్థులు మన్నె అనిల్, సయ్యద్ మహరాజ్, వెంకట్ రాములు, వేణు గోపాల్, సయ్యద్ ఆజామ్, నర్సింలు, సాయికుమార్, శేఖర్, స్వప్న, నవీన, వినోద్, రవి, విజయ్ పాల్గొన్నారు.