ఎల్లారెడ్డి రూరల్ : కాలనీవాసులు అప్రమత్తత, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో పెను అగ్ని ప్రమాదం (Fire Incident) తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని లక్ష్మీ టాకీస్ ఎదురుగా అబ్దుల్లా అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ షాప్ (Scrap shop) ఉంది.
బ్యాక్ డోర్ వద్ద గల కాటన్ సంచులకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దట్టమైన పొగలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చిన అగ్నిమాపద సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. స్క్రాప్ షాప్ చుట్టూ ఇండ్లు ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రావడం ఏమాత్రం ఆలస్యం జరిగినా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.