ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ
నిజామాబాద్ జిల్లాలో 81,017 మందికి తొలివిడతలో అందిన నగదు రూ.24.47 కోట్లు
రైతుల్లో హర్షాతిరేకాలు.. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ
ఖలీల్‌వాడి/శక్కర్‌నగర్, డిసెంబర్ 28 : ఈ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రాష్ట్రప్రభుత్వం రైతుల ఖాతాల్లో మంగళవారం జమచేసింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,67,044 మంది రైతులకుగాను 81,017 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 24.47 కోట్లు జమయ్యాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం మన రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్‌గౌడ్, వాగ్మారే సూర్యకాంత్, దొడ్డి శ్రీనివాస్, మహబూబ్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.